గరుడ ప్రతినిధి
చౌడేపల్లి డిసెంబర్ 06
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించింది-జూనియర్ కళాశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవ నివాళులు సమర్పించారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించి చిన్నతనం నుంచి తీవ్రమైన సామాజిక వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు.బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కూడా భేద భావాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం అంటరానితనం, సామాజిక వివక్ష నిర్మూలన తన జీవిత లక్ష్యమని భావించిన అంబేద్కర్ 1931లో మహాత్మా గాంధీజీని కలుసుకొని స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు.రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని అణగారిన వర్గాల తరఫున బలమైన వాదనలు వినిపించి ప్రత్యేక హక్కులను పొందగలిగారని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్తగా మహోన్నత సేవలు అందించారు స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ రచనా బాధ్యతలు అప్పగించబడగా, అంబేద్కర్ అత్యంత ప్రామాణికంగా, సమానత్వం, న్యాయస్థాపన, రక్షణలను ప్రధానంగా తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాగే స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా దేశ నిర్మాణంలో అనన్య సేవలు అందించారని తెలిపారు.1956 డిసెంబర్ 6న ఆయన పరమపదించారు.ఆయన వర్ధంతిని పురస్కరించుకొని, దేశానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ గౌరవ నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు సుబ్రమణ్యం,ఎన్.ఎస్.ఎస్ పోగ్రాం ఆఫీసర్ బాలాజీ, రవికుమార్,బాల్ పోల్ రెడ్డి,సురేష్,శాంతమ్మ,రెడ్డెమ్మ,ఆదినారాయణ రెడ్డి,నౌషద్ ఖాన్,రెడ్డిభాషా,నాగార్జున,
విద్యార్థులు పాల్గొన్నారు.






