గరుడ ప్రతినిధి
చౌడేపల్లి డిసెంబర్ 06
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవనం నందు పలు సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జరిగాయి.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అంబేద్కర్ జీవిత చరిత్రను మహార్ కుటుంబంలో జన్మించిన బీమ్ రావ్ పాఠశాలలో కూర్చోవడానికి కూడా సీటు లేకుండా పోయింది. నీళ్లు తాగడానికి బయట గ్లాస్ లో పోయాలి అలాంటి అవమానాలు ఎదుర్కొని కూడా చదువుకొని డాక్టర్ రేట్లు సాధించారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం చదువుతూనే ముందుకు వెళ్లాలి. కుల వివక్షతను ఎదిరించి మహాథ్ సత్యాగ్రహం , అలారం మందిర ప్రవేశం వంటి ఉద్యమాలు నడిపారు, నేను హిందూ మతంలో జన్మించాను కానీ హిందువుగా మరణించెను అని చెప్పి 1956లో నాగపూర్ లో లక్షలాది మందితో కలిసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. అని పలువురు కొనియాడారు. స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో బ్యాంకు రెడ్డప్ప పిల్లలకు అంబేద్కర్ గురించి అతని గొప్పతనాన్ని వివరించారు.చౌడేపల్లి మండలంలో నిర్వహించబోయే కార్యక్రమాలను గురించి అంబేద్కర్ భవనంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు మాల మహానాడు మండలాధ్యక్షుడు కొత్తపల్లి మనీ, వై శేఖర్, డాక్టర్ మహేష్ కుమార్,కృష్ణమూర్తి,పొదలపల్లి రమణ, కూరపర్తి శ్రీనివాసులు, కృపామని,రెడ్డి ప్రసాద్, గుట్ట రెడ్డి,వాసు,వేణుగోపాల్, మాల మహానాడు జనరల్ సెక్రెటరీ నక్కా సురేష్,సొరకాయల సురేష్ యకులు పాల్గొన్నారు.




