సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,జనగాం,డిసెంబర్06,(గరుడ న్యూస్):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనగాం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జనగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి అమనగంటి తిరుమలేశ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన మార్గం సమానత్వం,హక్కుల పోరాటం,అభివృద్ధి,ప్రజల సంక్షేమం
ఇవి మాత్రమే నిజమైన నాయకత్వానికి ప్రమాణాలు అని చెప్పుకొచ్చారు.జనగాం గ్రామంలో కూడా అదే అంబేద్కర్ ఆశించిన విలువలతో నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది.కులం కాదు,డబ్బు కాదు,మన గ్రామం కోసం పనిచేసే నిజాయితీ నాయకుడు కావాలి అన్నారు.మన యువత,మహిళలు,పిల్లలు
అందరి హక్కులు కాపాడి,అభివృద్ధి కోసం కష్టపడే నాయకుడు కావాలి.ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా
మనమందరం ఒక నిర్ణయం తీసుకుందాం.అభివృద్ధి కోసం ఓటు,సమానత్వం కోసం ఓటు,మన ఊరి భవిష్యత్తు కోసం ఓటు,అని తెలియజేశారు.



