సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, డిసెంబర్ 07,(గరుడ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు గంగపురం వసంత – నగేష్.ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నేలపట్ల గ్రామానికి ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే రాబోవు 5 ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఉత్తమ గ్రామపంచాయతీ గా రూపుదిద్ది పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారని గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వాగ్దానం చేశారు.యువత మధ్యతరగతి కుటుంబాలకు జీవనోపాధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామంలో కావాల్సిన మంచి నీరు,పరిశుభ్రత రోడ్ల పునర్వ్యవస్థీకరణ,విద్య, వైద్యానికి కావలసినటువంటి అన్ని పనులను కచ్చితంగా చేస్తానని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు



