సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,డిసెంబర్06,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి,లను గెలిపించండి అని నారాయణపురం గ్రామ ప్రజలను కోరారు సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 4 వ, వార్డు నెంబర్ సురపల్లి వెంకటేష్ నేత.ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి,గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు తనదైన శైలిలో నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న గొప్ప నాయకుడని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.లింగస్వామి సేవా కార్యక్రమాలలో భాగంగా గ్రామంలోని పేద ప్రజలకు రాజకీయాల కతీతంగా ఆర్థికంగాను,మౌలిక సదుపాయాలను,యువత కోసం ప్రతి సంవత్సరము క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న గొప్ప నేత అని చెప్పుకొచ్చారు.నేటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి,లను గెలిపించినట్లయితే మన గ్రామము మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పత్రికాముఖంగా గ్రామ ప్రజలకు తెలియజేశారు.



