క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పవన్ పై జయసుధ కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీలో చేరుతుందా! – Garuda Tv

Garuda Tv
2 Min Read


-పవన్ పై ఏం మాట్లాడింది!
-జయసుధ మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా!
-ఎవరికీ తలవంచడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్).. సహజనటి జయసుధ(జయసుధ).. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలుగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఎనలేని పాపులరిటీ ని పొందిన లెజండ్రీ యాక్టర్స్. ఈ ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవంగా కూడా ఉంది. ‘బాలు’ మూవీలో తల్లి కొడుకులుగా సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరికి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జయసుధ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్(ఆంధ్రప్రదేశ్)రాజమండ్రిలో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు. కొంత మంది మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాన్ని చెప్పమని జయసుధ ని అడిగారు. అప్పుడు జయసుధ మాట్లాడుతు పవన్ యాటిట్యూడ్ పవన్ దే. తనకంటూ ఒక స్టైల్ ఉంది. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేదు. ఆయన పడిన కష్టం, సిన్సియారిటీ నే ఈ రోజు డిప్యూటీ సిఎం స్థాయిలో ఉంచింది. మొదటిసారి ఫలితాలు అనుకూలంగా రానప్పుడే మనకెందుకులే అనుకోని వెనక్కి వెళ్లి పోవచ్చు. కానీ అలా వెళ్లకుండా ధైర్యంగా ఉన్నాడు. సినిమాల్లో చేస్తాను అంటే ఆయన అడిగింది, కోరుకుంది ఇవ్వడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. కానీ ప్రజల కోసం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సినిమాల్లో ఎవరికీ తలవంచలేదు. రాజకీయాల్లో కూడా అలాగే వెళ్తున్నాడని జయసుధ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!

ఇప్పుడు ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. జయసుధ ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ కాబోతుందని, జనసేన నాయకులతో టచ్ లో ఉన్నారనే వార్తలు కొన్ని రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో జయసుధ జనసేన పార్టీలో చేరుతుందేమో అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జయసుధ పొలిటికల్ జర్నీని ఒకసారి చూసుకుంటే 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సికింద్రాబాద్ ఎంఎల్ఏ గా పని చేసింది. ఆ తర్వాత టీడీపీ, వైసిపి లో కూడా పని చేసి బయటకి వచ్చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి నాయకత్వం వహించడం లేదు. ఇక ఇదే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో రాజకీయాలలోకి వస్తారా అనే ప్రశ్నకి జయసుధ బదులిస్తూ ప్రస్తుత రాజకీయాలు సూటవుతాయా లేదా చూడాలని చెప్పడం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *