గరుడ న్యూస్ పంజాణి రిపోర్టర్ 12/12/2025.గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చిత్తపులి నరేంద్ర పాడల్ గారు (చిత్తూరు జిల్లా ట్రైనీ కలెక్టర్) వారు శిక్షణ లో భాగంగా 10.12.2025వ తేదీన ఇండిపెండెంట్ ఎంపీడీఓ గా విధులందు చేరినారు. ఈ సందర్బంగా పెద్దపంజాని మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీమతి. జి. ఎస్. కె. శారదా దేవి, శ్రీ. జాకీర్ హుస్సేన్ గారు, సిబ్బంది ట్రైనీ కలెక్టర్ వారిని దుస్సలువ తో సన్మానించి స్వాగతం పలికినారు.తదుపరి అందుబాటులో వున్న పంచాయతీ సెక్రటరీ లు, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశము నిర్వహించి, పెద్దపంజాని మండలము నందు ప్రస్తుతం జరుపబడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకొనినారు.



