
-ఎవరు ఆ ఇద్దరు!
-ఆ టైం లో ఏం జరిగింది!
-బయటకి వచ్చిన అసలు నిజం
నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ‘అఖండ 2′(అఖండ 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా చరిత్రనే సృశించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.
నిజానికి పైన చెప్పుకున్న న్యూస్ ని గత వారం క్రితమే మనం చెప్పుకోవాలి. కానీ నిర్మాతలకి గతంలో ఉన్న ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ ఎవరు ఊహించని విధంగా అఖండ 2 కి ఎదురుకావడంతో డిసెంబర్ 5 నుండి వాయిదా పడింది. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ ఎంతగానో టెన్షన్ పడ్డారు. రిలీజ్ క్రిస్మస్ కానుకగా ఉండవచ్చా లేదా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఉండవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. దీనితో ఫ్యాన్స్ లో విపరీతమైన టెన్షన్. థియేటర్స్ దగ్గర పడిగాపులు. ఇక ఎట్టకేలకు వారం తర్వాత పదకొండు రాత్రి బెనిఫిట్ షో నుంచి ప్రారంభం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇది కూడా చదవండి: చిరంజీవి లేటెస్ట్ ట్వీట్ వైరల్.. ఆ సినిమాని ఉద్దేశించే చెప్పాడా లేక వేరేనా
ఇప్పుడు జరిగిన ఈ విషయం మొత్తం మీద ప్రముఖ గాయకుడు, భగవద్గీత యొక్క సారాంశం అందరికి అందాలని పరితపించే ”గంగాధర శాస్త్రి'(గంగాధర శాస్త్రి)గారు రీసెంట్ ఒక మీడియా ఛానల్‌లో మాట్లాడటం ‘అఖండ 2 ఫైనాన్షియల్ ఇష్యూస్ నుండి బయటపడింది మన ముందుకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం బాలకృష గారు, బోయపాటి(Boyapati)గారు. ఆ సమయంలో మిగిలిన ఎంత మందితో మీటింగ్ జరిగినా జీరో రిజల్ట్ నే. ఈ ఇద్దరే ఆర్థిక ఇబ్బందులని తమ భుజ స్కందాలపై వేసుకొని సినిమాని బయటకి తీసుకొచ్చారు. ఆ సమస్యని ఎంతో హుందాగా డీల్ చేసారని గంగాధర శాస్త్రి గారు చెప్పారు.




