శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 15/12/2025. చౌడేపల్లె మండలంలోని గాండ్ల పల్లె గ్రామంలో వెలసివున్న అతి పురాతనమైన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం విశేష పూజలు గాండ్లపల్లెవాసి వి. గిరినాథ్ ప్రకాష్ రమణయ్య మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోవిశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం ప్రధాన అర్చకుడు అర్చకత్వమున అభిషేక ప్రియుడు కి రంగురంగుల పూలతో అలంకరించి అభిషేకము విశేష అలంకరణ గావించారు ప్రత్యేకమైన రంగురంగులపూలతో అలంకరించి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో పూజించారు అభిషేకము వస్త్రాలంకరణ అష్టోత్రము ఆకు పూజ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ భుజంగ స్తోత్రం వంటి వి పారాయణం చేసిప్రత్యేక పూజలు నిర్వహించారు దేవునికి నెయ్యి దీపాలు వెలిగించి అగరవత్తులు వెలిగించితమలపాకులతో ఆకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకుల దండ సింధూరం సమర్పించిన భక్తులకు ఎలాంటి కష్టాలు దరిచేరవు అని భక్తుల విశ్వాసం అలాంటి స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారు భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ గోవింద నామస్మరణలతో ఆలయంలోపల భక్తుల నినాదాలతో ఆలయం కిటకిటలాడింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *