ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్! – Garuda Tv

Garuda Tv
2 Min Read


చంపింది ఎవరు!
అందుకే చంపారు!
దర్శకుడిగా ఎన్నో హిట్ మూవీస్
నటుడిగా కూడా సుదీర్ఘ ప్రయాణం

తండ్రి వారసత్వంతో సినీ రంగంలోకి ప్రవేశించి వారసత్వాన్ని బలంగా చాటి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో ‘రాబ్ రీనర్’ కూడా ఒకరు. ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్ర వేసి హాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులకి ఇష్టమైన దర్శకుడిగా మారారు. దిస్ ఈజ్ స్పైనల్ టాప్, స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, ఏ ఫ్యూ గుడ్ మెన్, ది అమెరికన్ ప్రెసిడెంట్, రూమర్ హాజ్ ఇట్, ఆల్బర్ట్ బ్రోక్స్ వంటి చిత్రాలకు ఉదాహరణ.

నిన్న రాబ్ రీనర్ ‘లాస్ ఏంజెల్స్’ లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆయనతో పాటు భార్య మైకేల్ సింగర్ కూడా విగత జీవిలా పడి ఉంది. ఈ ఒంటిపై కత్తి పోట్లు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా ఇద్దరు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ సినీ సర్కిల్స్ లోనే కాకుండా వరల్డ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు గల రాబ్ రీనర్ 1984 లో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ దర్శకుడి కంటే ముందే ఇరవై ఏళ్ళ వయసులోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చి విశిష్టమైన క్యారెక్టర్ పోషించాడు. అభిమాన గణం కూడా ఎక్కువే.

కూడా చదవండి: అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే

ఈ ఏడాది సెప్టెంబర్ 25న ‘ది స్పైనల్ టాప్ ప్రొడ్యూస్ సీక్వెల్ గా తెరకెక్కిన ‘ది స్పైనల్ టాప్ 2’ అనే మాక్యుమెంటరీ కామెడీ ఫిలింలో కనిపించింది. దర్శకుడు కూడా ఆయనే. విచిత్రం ఏంటంటే దర్శకుడిగా పరిచయమైన మూవీ కూడా స్పైనల్ టాప్ నే. దీనితో మొదటి చిత్రమే ఆఖరి చిత్రంగా మిగలడం అభిమానులని కంట తడి పెట్టిస్తుంది. సుమారు ఇరవై చిత్రాల వరకు దర్శకత్వం వహించిన రాబ్ నిర్మాతగానూ ఎన్నో గొప్ప సినిమాలని నిర్మించాడు. 1971లో ‘పెన్నీ మార్షల్’ అనే నటిని వివాహం చేసుకొని 1984లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతే మైకేల్ ని 1989 లో వివాహం చేసుకున్నాడు. మొత్తం నలుగురు పిల్లలు. ఇక తండ్రి కార్ల్ రినర్ అమెరికన్ సినీ ప్రపంచంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన లెజండ్రీ సినీ పర్సన్.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *