ఇదెక్కడి ట్రైలర్ రా మావ.. లేడీ గెటప్ లో సూపర్ స్టార్! – Garuda Tv

Garuda Tv
1 Min Read


కేజీఎఫ్, కాంతార సినిమాలతో కన్నడ పరిశ్రమ పేరు పాన్ ఇండియా స్థాయిలో మరోమోగిపోయింది. ఇప్పుడు కన్నడ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ’45’. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (45 సినిమా)

శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ’45’. సూరజ్ ప్రొడక్షన్స్ డైరెక్టర్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాతో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య గా ఇంట్రడ్యూస్ అవుతుండటం విశేషం. (45 ట్రైలర్)

’45’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్.. ఉపేంద్ర సినిమాలను తలపించేలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా ఉంది.

ఇది కూడా చదవండి: డేవిడ్ రెడ్డి మూవీలో రామ్ చరణ్!

“అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ డ్యాష్(-) మరణించిన తేదీ రాసి ఉంటుంది. ఆ మధ్యనున్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం” అనే డైలాగ్ తో ట్రైలర్.

సెటప్ పూర్తి కొత్తగా ఉంది. శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టిల పాత్రలతో పాటు.. ఇందులోని వాహనాలు, ఆయుధాలు అన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చివరిలో శివ రాజ్‌కుమార్ లేడీ గెటప్ లో కనిపించడం హైలైట్ గా నిలిచింది.

’45’ మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదలవుతుండగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 1న విడుదలైంది.

ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ’45’ మూవీ.. కంటెంట్ తోనూ సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *