
పార్వతీపురం:
తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు.మండల పార్టీ అధ్యక్షులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా వ్యవహరించాలని, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.



