
-సోను సూద్ మంచి మనసు
-రియల్ హీరో
-రొమ్ము క్యాన్సర్ చికిత్స
సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే ప్రతినాయకుడిగా భయపెట్టి ఆఫ్ ది స్క్రీన్ మంచి మనసుతో పది మందికి సాయం చేయడంలో ‘సోను సూద్'(సోను సూద్)ముందువరుసలో ఉంటాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నాడు. అందుకే అభిమానులు రియల్ హీరో అనే బిరుదుని కూడా ఇచ్చారు.
రీసెంట్ గా సోను సూద్ మాట్లాడుతు నా ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించాను. ఆ 500 మంది జీవితాన్ని కాపాడి వాళ్ళ జీవితాల్లో సరికొత్త వెలుగుని తీసుకురావడంతోపాటు ఆ కుటుంబాల్లో ఆనందం నింపిన మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాను. సమిష్టి కృషి ద్వారా ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి. ట్రీట్ మెంట్ చేసిన వైద్యులకి కూడా కృతజ్ఞతలు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తాను. త్వరలోనే రొమ్ము క్యాన్సర్ పై మరింత అవగాహన కలిపించే కార్యక్రమాలు చేస్తానని తెలిపాడు.
ఇది కూడా చదవండి: మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి!
ఇక సోను సూద్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 10 న బాలీవుడ్ లో ‘ఫతే'(Fathe)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాడు. కొత్త చిత్రాలేవి ఇంకా అనౌన్స్ చేయలేదు.



