గరుడ న్యూస్ పెద్దపంజాణి మండలం రిపోర్టర్21/12/2025.భవిష్యత్తు తరాల ఆరోగ్య రక్షణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్దపంజాణి పీహెచ్సీ కేంద్రంలో ఆదివారం మెడికల్ ఆఫీసర్ మురళి పల్స్ పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులంతా చుక్కలు వేయించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అని గుర్తు చేసుకోవాలన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు మండలంలోని పంచాయితీ వైస్ సుమారు 3823 మంది పిల్లలకు పల్స్ పోలియో పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ సుధారాణి డాక్టర్ లిఖిత ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగనవాడి టీచర్లు పాల్గొన్నారు
