
పార్వతీపురం నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ సంతకాలు కలిగిన ప్రశంసా పత్రాలను ఉత్తమ కార్యకర్తలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్వయంగా అందజేశారు.
అందులో భాగంగా మేదర సంఘం యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రంధి రామారావు ఉత్తమ కార్యకర్తగా ఎంపికై ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం ప్రజలకు చేరవేసే బాధ్యతలో కార్యకర్తలు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.



