సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,జనగాం,జనవరి11,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ సర్పంచిగా ఇటీవల గెలుపొందిన లోడే రఘు కి మరియు వార్డు మెంబెర్స్ కు గౌడ సంఘం అధ్యక్షులు నాతి కృష్ణయ్య గౌడ్ ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు ఆయనకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే సర్పంచ్ గా గెలుపొందిన యువ నాయకులు లోడే రఘు కి గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బెల్లంకొండ శంకరయ్య గౌడ్, కొండూరి లక్ష్మయ్య గౌడ్,తండా యాదయ్య గౌడ్,కొండూరి మల్లేష్ గౌడ్,లోడే యాదయ్య మరియు గీత పనివారల సంఘం మెంబర్లు,నాయకులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
