సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,జనవరి23,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్వేల్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో చిలకరాజు చందన రాజు గెలవాలని సర్వేల్ గ్రామస్తులు,సాక్షి గణపతి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత యల్లంకి వెంకటేష్ గౌడ్,స్నేహితులు శ్రీ అందోల్ మైసమ్మ అమ్మవారి ని మొక్కారు.ఈ నేపథ్యంలో సర్పంచ్ గా గెలిపించిన సందర్భాన అట్టి మొక్కు ను శ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యక పూజలు చేసి,అనంతరం 101 కొబ్బరికాయ లు కొట్టి మొక్కు ని ముక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేల్ గ్రామానికి సర్పంచ్ గా గెలిచిన చిలక రాజు చందన రాజు కి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామాభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లంకి వెంకటేష్ గౌడ్,బిళ్ళ కంటి సుధీర్,కస్తూరి లింగస్వామి,పాపగళ్ళ మహేష్,చిలివేరు శివ,పిట్టల కృష్ణ,ఉప్పు చిన్న కృష్ణ,తదితరులు,పాల్గొన్నారు.



