విజయ్, రష్మిక పెళ్లి.. అది ఫేక్ న్యూస్! – Garuda Tv

Garuda Tv
1 Min Read


వైరల్ గా మారిన విజయ్, రష్మిక పెళ్లి న్యూస్!
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్!

కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజే(ఫిబ్రవరి 2) వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్తల్లో నిజంలేదు.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అంతవరకు నిజమే. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం అక్టోబర్‌లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక పెళ్లి డేట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నేడే పెళ్లి అంటూ తెగ న్యూస్ వైరల్ అవుతోంది. (విజయ్ రష్మిక వెడ్డింగ్)

నిజానికి విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుంది. త్వరలోనే ఈ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుందట. ఆ తర్వాత హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కి అందరినీ పిలవనున్నారని తెలుస్తోంది.

2018లో విడుదలైన ‘గీత గోవిందం’, 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ కలిసి ఫెస్టివల్, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

కాగా, విజయ్-రష్మిక వివాహం ఫిబ్రవరి 26న జరగనుందని గత డిసెంబర్ లోనే ‘తెలుగువన్’ చెప్పడం విశేషం.

ఇది కూడా చదవండి: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *