రెండు షాట్ల కోసం ఆరు నెలలు.. మహేష్ ని మార్చేసిన జక్కన్న! – Garuda Tv

Garuda Tv
1 Min Read


‘వారణాసి’ని గొప్పగా చెక్కే పనిలో జక్కన్న
రెండు షాట్ల కోసం ఆరు నెలలు ట్రైనింగ్
మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ చేంజ్

దర్శకధీరుడు రాజమౌళి(రాజమౌళి)కి జక్కన్న అనే పేరుంది. ప్రతి షాట్ ని తాను అనుకున్న విధంగా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటారు. అందుకే రాజమౌళికి ఆ పేరు పడిపోయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘వారణాసి'(వారణాసి) కోసం అంతకుమించి చెక్కుతున్నారు. కేవలం రెండు షాట్ల కోసమే సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు)ని ఏకంగా ఆరు నెలలు కష్టపెట్టారు. ఈ స్వయంగా మహేష్ బాబు రివీల్ చేయడం విశేషం.

‘వారణాసి’ మూవీ టీమ్ రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయంపై రాజమౌళి ఎంత కేర్ తీసుకుంటారో మహేష్ వివరించారు. “రాజమౌళి ప్రతి వర్క్ చేశాను. ఈ సినిమా కోసం ఎన్నో షాపులు జరిగాయి. ఎన్నిసార్లయినా రిహార్సల్స్ చేస్తారు. ముఖ్యంగా నేను ఇందులో నటించిన రాముడి పాత్ర కోసం రిహార్సల్స్ చేశాం. దానికోసం 2-3 నెలలు కష్టపడ్డాం. వారణాసి కోసం నేను చాలా కష్టపడ్డాను. అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇతర హీరోల అభిమానులు కూడా మహేష్ రన్నింగ్ గురించి మాట్లాడుతుంటారు. అలాంటిది ఇప్పుడు మహేష్ రన్నింగ్ స్టైల్ ని రాజమౌళి మార్చేయడంతో.. కొత్త రన్నింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: షాకింగ్.. జబర్దస్త్ కమెడియన్ మృతి.. యాంకర్ సుమ కన్నీటి పర్యంతం!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *