మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు : శ్రీ స్వయంభు మల్లేశ్వర స్వామి ఆలయం

Garuda Tv
1 Min Read

చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం, కావేటి గారి పల్లె

శ్రీ స్వయంభు మల్లేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు 15 – 2 – 2026వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భముగా పులిచెర్ల మండలం, కావేటి గారి పల్లి గ్రామం సమీపంలోని కొండపై స్వయంభుగా వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నందు అంగ,రంగ వైభవంగా మహోత్సవాలు జరుగును. కావున ఆదివారం మహాశివరాత్రి సందర్భముగా ఉదయం నుండి రాత్రి వరకు తత్వ భజనలు, కోలాట భజనలు, చెక్కభజనలు జరుగును. రాత్రికి పంచ కళ్యాణి నాటకం అనగా 5 నాటకాలను ఒకేరోజు రాత్రి కంశవధ, ద్రౌపతి మానసంరక్షణ, కీచక వధ ఇలాంటి నాటకాలను కీలక ఘట్టాలను గొప్ప గొప్ప కళాకారులచే వీధి నాటకం జరుగును. స్వామి వారి ఆలయం నందు కోనేరు నుండి గుడి దగ్గర వరకు మెట్లు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి ఉదయం నుండి వచ్చే భక్తులకు భోజనాలు మరియు మంచినీటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి సాయంత్రం నాలుగు గంటలకు కొండపై వెలసిన స్వయంభు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ చల్లా బాబు రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులతో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అదేవిధంగా ప్రియతమ నాయకులు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులివర్తి నాని గారు సాయంత్రం ఏడు గంటలా 30 నిమిషాలకు స్వామివారి అభిషేకములో పాల్గొంటారు. అందరూ ఆదివారం అనగా 15 – 2 – 2026వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ స్వయంభు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగాలతో తులతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు, మీ…ఎస్ ప్రసాద్ రాయల్ ఆలయ చైర్మన్

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *