
–ప్రేమ విషయంలో త్రిప్తి డిమ్రి ఏం చెప్పబోతోంది
-ఈ నెల 13న మరో సంచలనం తప్పదా!
-చివరకి ప్రేమ విషయంలో ఏం చెప్తుంది
యానిమల్ లో ఏ ముహూర్తాన ‘త్రిప్తి డిమ్రి'(Tripti Dimri)అడుగుపెట్టిందో కానీ, ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఆమె గురించి ఆలోచించని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలోచనలకి గ్యాప్ ఇవ్వడం తృప్తి కి కూడా ఇష్టం లేదేమో, స్పిరిట్ పోస్టర్ లో గాయాలతో ఒంటి నిండా బ్యాండేజ్ లు వేసుకున్న ప్రభాస్ సిగరెట్ తాగడానికి వైట్ శారీలో ఉన్న త్రిప్తి లైటర్ వెలిగించి హెల్ప్ చేస్తుంది. దీనితో స్పిరిట్ లో త్రిప్తి చేసే మ్యాజిక్ ఏ విధంగా ఉండబోతుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ తన అప్ కమింగ్ మూవీ ‘ఓ రోమియో'(ఓ రోమియో)పై కూడా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.తను ఈ చిత్రంలో ‘ఆఫ్షా’ అనే క్యారక్టర్ నటిస్తుంది.
చిత్ర బృందం రీసెంట్ గా ఇనిస్టా వేదికగా త్రిప్తి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో త్రిప్తి ఎక్స్ ప్రెషన్ ని చూస్తుంటే ప్రేమలో మోసపోయినట్టుగా అనిపిస్తుంది. మేకర్స్ కూడా అందుకు తగ్గట్టే ‘ప్రేమ అనేది ‘ఆఫ్షా’ ని పట్టుకున్న శాపం అనే వ్యాఖ్యలను జోడించడంతో త్రిప్తి రోల్ తో పాటు మూవీపై అంచనాలు పెరిగాయి. అగ్ర హీరో షాహిద్ కపూర్(షాహిద్ కపూర్)త్రిప్తి జంటగా దిశా పటాని ,తమన్నా, నానాపటేకర్ వంటి అగ్రశ్రేణి యాక్ట్రెస్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
కూడా చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న విత్ లవ్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా!
విశాల్ భరద్వాజ్(విశాల్ భరద్వాజ్)దర్శకత్వంలో సాజిద్ నడియావాలా ఈ నెల 13 న థియేటర్లలోకి ల్యాండ్ అయ్యాయి. యానిమల్ తర్వాత చేసిన చాలా సినిమాల విషయంలో తృప్తి తాను అనుకున్న రిజల్ట్ ని రాబట్టలేకపోయింది.మరి ‘ఓ రోమియో’ ద్వారా అయినా భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.




