
ఈటీవీలో త్వరలో అమ్మోరు అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ సీరియల్ లో కల్కి, చరిష్మా నటిస్తున్నారు. వీళ్ళతో ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పారు ఇద్దరూ. "హలో అండి నా పేరు కల్కి రాజా. పాశర్లపూడి నా విలేజ్. నేను అమలాపురం కుర్రోడిని" అని చెప్పాడు. "నా పేరు చరిష్మా శ్రీకర్. తెలుగు అమ్మాయినే. నేను పుట్టింది హైదరాబాద్. కానీ మా పేరెంట్స్ వాళ్ళది ఆంధ్రా, విజయవాడ, గుంటూరు ఆసైడ్ నుంచి వచ్చారు. మా మదర్ ఫాదర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. మా అమ్మ శ్రీప్రియ. ఆమె కూడా నటి. మీరెన్నో సీరియల్లో డైరెక్టర్ చూస్తున్నారు. అమ్మోరు సీరియల్ ద్వారా లాంచ్ అవుతున్నాను" అని చెప్పింది. "అమ్మోరు సీరియల్ ని సెలెక్ట్ అక్కడ రీజన్ ఏంటి ?" అని హోస్ట్ అడిగింది. "మొదటి రోజు షూట్ కి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది. ప్రతీ చిన్న పాయింట్ ని కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నారు.
నా బాడీ మీద ఉన్న టాటూస్ దగ్గర నుంచి అన్ని విషయాల గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి అప్రూవల్ తీసుకుని ఆయన ఓకే అన్న తర్వాత షూట్ చేస్తున్నారు. అందుకే ఈ సీరియల్ నేనే చేయాలి అనుకున్నారు. టీజర్ లాంఛ్ అయిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పాడు. "నేను అమ్మోరు సెలెక్ట్లో రీజన్ ఏంటంటే నేను మూవీస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి మూవీస్ మీద ఇంటరెస్ట్ ఉంది. మూవీస్ చేస్తూ ఉంటే మమ్మీ, డాడీ సర్కిల్ అంతా ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల అప్పుడప్పుడు నన్ను సీరియల్స్ చేయమని అడిగారు. నాకు మూవీ సైడే ఇంట్రెస్ట్ ఉండేసరికి సీరియల్స్ ఎందుకు అని చెప్పేసి చాలా రోజులు ఆపుకుంటూ వచ్చాను. బట్ ఈ అమ్మోరు ప్రాజెక్ట్ మల్లెమాల నుంచి నా కాల్ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ హావ్ నో అదర్ రీజన్ అంటే నో చెప్పడానికి అసలు రీజన్ అనేది దొరికింది. ఫస్ట్ ఈటీవీ తర్వాత లెజెండరీ మూవీ అమ్మోరు అనేది. దాంట్లో ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను లాంచ్ అవడం అనేది అదృష్టం అనుకోని నేను ఈ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నాను". "అమ్మోరు సీరియల్ షూట్ లో మీరు ఫస్ట్ చేసిన కెమెరా సీన్ ఏంటి " అని అడిగింది. పెద్ద ముగ్గేశారు పుర్రె పెట్టారు. ఆ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కి నాకు 12 గంటలు పట్టింది. ఆ గెటప్ లో టచప్ చేసుకోవాలి అన్నా కూడా భయం వేసింది" అని చెప్పాడు.
"నాకు నా ఫస్ట్ సీన్ వచ్చేసి చాలా నీట్ గా క్యూట్ గా ఉంటే ఇంట్రడక్షన్ . అమ్మవారికి పూజ చేయడం ఇలా జరిగింది. పాజిటివ్ గా చాలా. కానీ ఈ సీరియల్ లో ఇప్పటి వరకు చేసిన వర్కింగ్ డేస్ తక్కువైనా కానీ వింటర్ లో అభిషేకాలు, వాటర్ పోయాడము, చలి, నైట్ కాల్ షీట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. టెలికాస్ట్ అప్పుడు మిస్ అవ్వకుండా చూడండి." అని చెప్పింది. చరిష్మా ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ అపర్ణ దేవి రోల్ లో నటిస్తున్న శ్రీప్రియ శ్రీకర్ కూతురు. ఈ అమ్మోరు సీరియల్ ఈ ఫిబ్రవరి 16 నుంచి రాత్రి 7:30 నిమిషాలకి ప్రసారం కాబోతోంది.