
తిరుపతి జిల్లా, ఫిబ్రవరి 21: గరుడ న్యూస్ (ప్రతినిథి): ఎస్.సి. కార్పొరేషన్ రుణాలకు ఎలాంటి గ్యారంటీ మరియు భద్రత లేకుండా బ్యాంకర్ కు లబ్ధిదారుడు మధ్య ఎటువంటి మధ్యవర్తులు లేకుండా రుణాలు మంజూరు చేసెలా సులభతరం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కు,తిరపతి జిల్లా ఎస్సీ .ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యుడు పునభాకం వాలముని విజ్ఞప్తి చేశారు.తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తిరుపతి జిల్లా ఎస్సీ .ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యుడు పునభాకం వాలముని పాల్గొని మాట్లాడుతూ ఎస్.సి. కార్పొరేషన్ నుండి రుణాలు తీసుకునే బాధ్యత వహించే లబ్ధిదారులకు ఎటువంటి భద్రత (కోలెటరల్) మరియు గ్యారంటీ లేకుండా రుణాలు మంజూరు చేయడానికి సంబంధించి సక్రమమైన చర్యలు తీసుకోవాలని, తిరుపతి జిల్లా నగర రోడ్ల పక్కన కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉండే చర్మకారులకు రుణాలు మంజూరు చేయమని మరియు రోడ్లపై కూర్చొని చెప్పులు కుట్టే వాళ్లకు చిన్న బంకులు మంజూరు చేయమని కలెక్టర్ ని కోరారు. అదే విధంగా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఉంటే ఎస్.సి. కార్పొరేషన్ రుణాలు పొందే వారికి సులభతరంగా రుణాలు పొందటానికి సహాయపడుతుంది మరియు తక్షణమే ఆర్థిక ప్రయోజనాలను అందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తిరపతి జిల్లా ఎస్సీ .ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

