
పాలకొండ,ఫిబ్రవరి 27,(గరుడ న్యూస్)
మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం శివరాత్రి సందర్బంగా వీరఘట్టం అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వంచబడిన శైల పద్మరాజ్ న్యూ హెల్పింగ్ హేండ్స్ వారి ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ , కూటమి నాయుకులు సహాయ సహకారాలతో, లోకల్ టాలెంట్ శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొదిద్దాం మనుషుల్లో వివేకాన్ని తట్టిలేపుదాం అనే కార్యక్రమంతో డాన్స్ పోటీలు, మ్యాజిక్ షో, సిని మిమిక్రీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సందర్బంగా టౌన్ అధ్యక్షులు జామి లక్ష్మి నారాయణ మాజీ నీటి సంఘం అధ్యక్షులు బల్లా హరిబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, టౌన్ నాయుకులు కర్నెన సాయిపవన్, ఉదయాన చరణ్, మెడిద సందీప్, దావీద్ పాల్గొని విజయవంతం చేశారు.

