
సాలూరు, గరుడ న్యూస్ ప్రతినిధి :నాగార్జున
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా సాలూరు మండలం అన్నమరాజవలస పంచాయతీ పందిరి మామిడి వలస గ్రామంలో ఆర్ట్స్ సంస్థ భాగస్వామ్యంలో నాబార్డ్ వారి సౌజన్యం తో ఏర్పాటు చేయబడిన మన్య శ్యామలంబ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు మహిళా దినోత్సవం FPO (ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ) చైర్మన్ చల్లా వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నం రాజు వలస గ్రామ సర్పంచ్ సీమల రాములమ్మ, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ మరియు పందిరిమామిడివలస స్కూల్ హెచ్ఎం చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటే ఆ గ్రామాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు సమానత్వం సాధికారత కల్పించాలి అని తెలిపారు. బాలికలు చదివిస్తే ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మా తల్లిదండ్రులను మమ్మల్ని చదివించడం వలన ఈరోజు మేము ఉద్యోగాలు చేయగలుగుతున్నాము అన్ని రంగాల్లో మహిళలు ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు రక్తహీనత బారిన పడకుండా పౌష్టికాహారం తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి బాల్యవివాహాలు చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీమల రాములమ్మ, అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి,vaa ప్రమీల, ఆశా వర్కర్ రామలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ వెంకటలక్ష్మి మరియు పద్మాలను FPO సభ్యులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు , FPO సభ్యులు మరియు ఆర్ట్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
