Contents
అవిశ్వాస తీర్మాన పత్రాల ను జెసి, మున్సిపల్ కమిషనర్ కు సమర్పించిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లుపార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికయి నాలుగేళ్లయిన చైర్మన్, వైస్ చైర్మన్ తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పురపాలక చైర్మన్,వైస్ చైర్మన్ ల అవిశ్వాస తీర్మాన పత్రాలను జెసి శోభిక, కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు . వైకాపా హయాంలో ఏర్పాటు అయిన కౌన్సిల్ పట్టణ అభివృద్ధి పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు ఎన్నో హామీ ఇచ్చి కౌన్సిలర్లుగా ఎన్నికై వార్డుల అభివృద్ధికి ఏమీ చేయలేకపోతున్నాం అన్న అసంతృప్తి చాలా మందిలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నచ్చి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. అందరం కలిసి పట్టణం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అవిశ్వాస తీర్మాన పత్రాలను అధికారులకు అందజేయడం జరిగిందని త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిల్ సభ్యులు ఎవరికి మద్దతుగా ఉంటారో వారికి సంబంధించిన వారు చైర్మన్ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అవుతారని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అవిశ్వాస తీర్మాన పత్రాల ను జెసి, మున్సిపల్ కమిషనర్ కు సమర్పించిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లు



పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికయి నాలుగేళ్లయిన చైర్మన్, వైస్ చైర్మన్ తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పురపాలక చైర్మన్,వైస్ చైర్మన్ ల అవిశ్వాస తీర్మాన పత్రాలను జెసి శోభిక, కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు . వైకాపా హయాంలో ఏర్పాటు అయిన కౌన్సిల్ పట్టణ అభివృద్ధి పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు ఎన్నో హామీ ఇచ్చి కౌన్సిలర్లుగా ఎన్నికై వార్డుల అభివృద్ధికి ఏమీ చేయలేకపోతున్నాం అన్న అసంతృప్తి చాలా మందిలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నచ్చి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. అందరం కలిసి పట్టణం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అవిశ్వాస తీర్మాన పత్రాలను అధికారులకు అందజేయడం జరిగిందని త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిల్ సభ్యులు ఎవరికి మద్దతుగా ఉంటారో వారికి సంబంధించిన వారు చైర్మన్ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అవుతారని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



