
పార్వతీపురం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ఇప్పల పోలమ్మ అమ్మవారి 17 వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పల పోలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజల పై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



