బిజెపి నిర్వహిస్తున్న దరఖాస్తుల సేకరణకి ప్రజల నుండి వస్తున్న స్పందనతో మింగుడు పడని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్

G Venkatesh
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్5,(గరుడ న్యూస్ ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చకపోవడంతో సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని లచ్చమ్మ గూడెం,వాచ్య తండ,పల్లగట్టు తండాలలో ఆయా గ్రామాల భూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి జక్కలి రాజు యాదవ్,పాల్గొని మాట్లాడుతూ బిజెపి తీసుకున్నటువంటి దరఖాస్తుల సేకరణ కార్యక్రమానికి ప్రజల వైపు నుండి అనూహ్య స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు భారతీయ జనతా పార్టీ మీద నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలకు భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయబోదని దరఖాస్తుల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు జక్కలి ఈశ్వర్ యాదవ్,వాంకుడోత్ హాథిరాం నాయక్,కేలోత్ సంపత్ నాయక్,సాగర్ల లింగయ్య,జక్కర్తి బిక్షం,ఆత్కూరి రాములు,భాస్కర్ నాయక్,సురపల్లి శివాజీ,సంతోష్ నాయక్,చిన్న నాయక్,రాజ్ కుమార్ నాయక్,తరునోజు నవీన్ చరి,ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *