తిరుపతి జిల్లా, చంద్రగిరి గరుడ న్యూస్ (ప్రతినిధి): రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీ శక్తి పీఠంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవమి ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పుత్రకామిష్టి యాగం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీ శక్తి పీఠంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వర నంద భారతి మహాస్వామి వారి అనుగ్రహంతో, శ్రీ శక్తి పీఠాధిస్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామనవమివేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో పుత్ర కామిస్టి యాగం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ యాగానికి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి మహాస్వామి వారి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి పిల్లలు లేని దంపతులు ఈ పుత్రకామిస్టి యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ శక్తి పీఠంలో ఈ యొక్క యాగం చేయడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. యాగంలో పాల్గొన్న దంపతులకు సంతానం ప్రాప్తి కలుగుతుందన్నారు. గత కాలంలో యాగం చేసిన దంపతులు చేసిన వారు వారి పిల్లలతో రావడం ఎంతో సంతోషకరమన్నారు. యాగంలో పాల్గొన్న దంపతులను శ్రీ మాతాజీ వారు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. భక్తులు కనుల పండుగగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.






