
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తిరుపతిలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని తిరుపతి అంబేద్కర్ భవనం కమిటీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం సభ్యులు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ను మరియు జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వపరంగా నే అధికారికంగా అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14 న తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తామని తెలియజేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో తిరుపతి అంబేద్కర్ భవనం కమిటీ చైర్మన్ పి పరమశివన్, కార్యదర్శి నాగేశ్వరరావు, సభ్యులు గోపి, అంబేద్కర్ స్టార్ కృష్ణ, ప్రసాద్ రావు, ఎస్వి నగర్ గిరి, ధన శేఖర్, పుష్ప రాజ్, ద్వారక, రఘు రాముడు, రమేష్, కృష్ణమూర్తి, శరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.



