
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,చౌటుప్పల్,ఏప్రిల్ 24,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఐఎన్టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా కాశ్మీర్ లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండించి,వారి ఆత్మ శాంతించాలని కోరుతూ నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.జమ్మూ కాశ్మీర్ పర్యటించడానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన యావత్ దేశప్రజల్ని కలచివేసిందని ఇది హేయమైన చర్య అని అన్నారు.మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి ద్వారా కాశ్మీర్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు.ఇలాంటి చర్యలు పునవృత్తం కాకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.భారత్ వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూడడానికి సాహసం చేయకుండా తగిన గుణపాఠం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

