రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,ఏప్రిల్27,(గరుడ న్యూస్):
నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు దాసరి లవలేష్ ఆధ్వర్యంలో దాదాపు 50 కార్లతో,బైకులతో జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కెసిఆర్ వరంగల్ భారీ సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసరి లవలేష్ మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ పాలన శ్రీరామరక్ష అంటూ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలన రైతు,విద్యార్థి యువజన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వమని త్వరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు అంతా బిఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలకు,తదితరులు,పాల్గొన్నారు.




