ప్రజలు సహకరిస్తే అభివృద్ధి చేయడమే తన లక్ష్యం – మైదుకూరు ఎమ్మెల్యే                
           పుట్టా సుధాకర్ యాదవ్

Sesha Ratnam
2 Min Read

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టా

మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారిమఠం, గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏ ఓబుల్ రెడ్డి: మే 12 (గరుడ న్యూస్): మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధితోపాటు తన సొంత మండలమైన బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల నందు జూనియర్ కళాశాల కొత్త భవనాల నిర్మాణం  కొరకు భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలు శాశ్వతం కాదని పార్టీలకతీతంగా మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తాను దృఢ సంకల్పంతో ఉన్నానని అన్నారు. మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్న కారణంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బద్వేల్ ఆర్డీవో,మఠం తాహసిల్దారు లతో కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో భూ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండల వ్యాప్తంగా 7500 ఎకరాల భూమి ఉండగా 15వేల ఎకరాలు వరకు ఆన్ లైన్ చేసుకోవడం జరిగిందన్నారు. రేకలకుంట పంచాయతీ నందు నీటి సమస్య అధికంగా ఉందని, తిప్పిరెడ్డిపల్లె నందు నేటి సమస్య ఉందని వీటికి ప్రణాళికతో ముందుకెళతామని అన్నారు. మండలానికి 3 చెక్ డ్యాములను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి మహా గురుకులం విద్యార్థులకు అందించడానికి మరో 15 లక్షల రూపాయలకు సంబంధించిన పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు
కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఉపాధ్యాయుల, పాఠశాలకు సంబంధించిన వివిధ సమస్యలను సంబంధిత అధికారులతో పరిష్క రించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. అనంతరం ఈమధ్య కాలంలో మండలంలోని పాపిరెడ్డి పల్లె నందు చనిపోయిన వీర జవాను కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతి చెందిన జవాన్ భార్యకు మైదుకూరు మార్కెట్ యార్డ్ నందు అటెండర్ ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం  ఎమ్మెల్యేనుఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివ యాదవ్, ఎస్సార్ శ్రీనివాసులురెడ్డి పుట్టా ప్రభాకర్ యాదవ్, ఎల్లటూరి సాంబశివరెడ్డి, యత్తపు ఈశ్వర్ రెడ్డి, పుటాల శివ, సన్నపురి శీను, గంగరాజు, సుధాకర్ యాదవ్, కస్తూర్బాగాంధీ పాఠశాల ప్రిన్సిపల్ అనూష, పలువురు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *