గరుడ ప్రతినిధి పుంగనూరు

గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని స్కూటరిస్టు పరిస్థితి విషమించిన సంఘటన ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం, ఈడిగపల్లి వద్ద బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమారు 35 ఏళ్ళ వయసున్న గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో వారు క్షతగాత్రున్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధితుడికి సంబంధికులు ఎవరూ లేకపోవడంతో అతన్ని స్థానిక ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.


