
గరుడ టీవీ ప్రతినిధి చౌడేపల్లి
హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని పలుచోట్ల దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు మండలంలోని రాజనాల బండ పై గల ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి చౌడేపల్లి బస్టాండ్ లో గల కమల ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు వేద పండితులు వశిష్టాచార్యులు సత్యనారాయణ శర్మ ల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకము ఆకు పూజ విశేషాలు అలంకరణ నిర్వహించారు అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వినాయక సేవా సంఘం సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

