
తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. దేశభక్తితో సమాజ సేవలో భాగస్వామ్యులు కండి.దేశ రక్షణకు. ఉత్తమ పౌరులను అందించడానికే ఎన్సీసీ శిక్షణలు = రాజగోపాల్ జగదీష్ ఆత్రే.
రామచంద్రపురం:- విద్యార్థులలో చిన్నతనం నుండే దేశభక్తి, సమాజ సేవను పెంపొందింపజేసి, దేశ రక్షణకు ఉత్తమ పౌరులను అందించడానికే ఎన్సీసీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని క్యాంపు.కమాండెంట్ కెప్టెన్ రాజగోపాల్ జగదీష్ ఆత్రే అన్నారు. మంగళవారం సి. రామాపురంలోని వెరిటాస్ సైనిక పాఠశాల ఆవరణంలో 11 ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్నికల్) ఎన్సీసీ తిరుపతి గ్రూప్ ప్రధానకార్యాలయాల ఆధ్వర్యంలో కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఈ కంబైన్డ్ వార్షిక ఎన్సీసీ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా, క్రమశిక్షణగా భాగస్వాములై అందరికీ ఆదర్శవంతంగా నిలవాలన్నారు. ఈ కంబైన్డ్ వార్షిక శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో ఎయిర్ వింగ్ విభాగంలో 8 మంది, ఆర్మీ వింగ్‌లో 8 మంది విద్యార్థులను గుర్తించి జాతీయస్థాయి శిక్షణ తరగతులకు ఎంపిక చేస్తామని క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ రాజగోపాల్ జగదీష్ ఆత్రే తెలిపారు. ఈ ఎన్సీసీ శిక్షణ శిబిరాలలో క్యాడె ట్లకు యోగా శిక్షణ, విపత్తులు, ప్రమాదాల నివారణపై డ్రిల్స్, పారిశుధ్యం, ఆరోగ్యంపై వర్క్‌షాప్‌లు, ఆయుధాల నిర్వహణ, ఎయిర్ వింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్ టేకింగ్ ఆఫీసర్ రాజశేఖర్, క్యాంప్ పర్యవేక్షకులు గుణశేఖర్ లు తెలిపారు. శారీరక దృఢత్వాని పెంపొందించడానికి హెల్త్ రన్, వ్యాయామాలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ శిక్షణ అధికారి లక్ష్మీ నరసింహ విద్యార్థులకు విమానాల నడపడంపై శిక్షణ ఇచ్చారు. స్విమ్స్ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంపు కమాండెంట్ కల్నల్ శ్రీనివాసులు, క్యాంప్ పర్యవేక్షకులు గుణశేఖర్ ఏ ఎన్ ఓ లు, ఆఫీస్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




