
గరుడ న్యూస్ చౌడేపల్లి పట్టణంలోని బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి అందరికి పంచి పెట్టారు. అనంతరం పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు. రమేష్ రెడ్డి జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అభిమానులు రక్తదానం చేసారు. అదేవిదంగా మండల ఆరోగ్య కేంద్రం నందు రోగులకు,గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు పంపిణి చేసారు.పలువురు మాట్లాడుతు స్వర్గీయ గువ్వల రామకృష్ణ రెడ్డి సేవలు మరువలేమని అదే బాటలో రమేష్ రెడ్డి ప్రజల సేవలో ముందుకు వెళ్తున్నారని అలాంటి నాయకులు నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా వుండాలని కొనియాడారు. కార్యక్రమములో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

