
గరుడ న్యూస్ చౌడేపల్లి మండలం లోని పెద్దకొండామర్రి గ్రామపంచాయతీ కోటూరు గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వీరు ప్రసంగిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ బలోపేతానికి కృషి చేస్తున్నదని ప్రతి విద్యార్థి ఉచితంగా పంపిణీ చేసిన కిట్లను ను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.గురువారం నుండి విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం భోజన వసతి కల్పించిందని నూతనంగా బదిలీపై పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు సుభాన్ భాలిరెడ్డి మరియు ఎస్ఎంసి కమిటీ మెంబర్లు ప్రధానోపాధ్యాయులు బళ్లాపురం మురళి ఉపాధ్యాయులు బాబురమేష్, శివకుమార్, భాగ్యలక్ష్మి, తెజేశ్వని, షహీన్, సంధ్యా,బాషా, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
