

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ” ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం కార్యక్రమంలో భాగం గా ‘ తల్లికి వందనం కార్యక్రమం ముఖ్యమంత్రివర్యులు, మరియు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు” కలిసి గురువారం కార్యక్రమం ప్రవేశపెట్టిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే చదువుకున్న ప్రతి విద్యార్థికి 13 వేల రూపాయలు” నేరుగా తల్లి ఎకౌంట్లో పడ్డాయి. రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తో పాటు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో బటన్ నొక్కిన పది రోజుల వరకు” ఎకౌంట్లో డబ్బులు వచ్చిన పరిస్థితులు కనబడలేదు” హంగు ఆర్బటం లేకుండా, ప్రజాధనం వృధా కాకుండా, చదువుతున్న పిల్లలకు ఇబ్బంది కలక్కుండా, రెవెన్యూ వాళ్ళకి, పోలీస్ వాళ్లకు ఇబ్బంది పెట్టకుండ” చేసిన ఈ కార్యక్రమం వల్ల” కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాయి అనటం సందేహం లేదు. రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా భావించి, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి కి మనసు స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి జగదీష్.
