
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్13,(గరుడ న్యూస్):
రాజు ఎక్కడున్నా రాజే అనే పదానికి రాజ్ గోపాల్ రెడ్డి నిదర్శనమని పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ముందుండే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి ఎమ్మెల్యేల గెలుపు కోసం,ఇటీవల జరిగిన ఎంపి ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది రాజగోపాల్ రెడ్డి గారే.తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంపీగా పార్లమెంట్లో తన తెలంగాణ నినాదాన్ని,తన గళాన్ని సోనియా గాంధీ,కి తన సహచర ఎంపిలతో కలిసి వినిపించి తెలంగాణ ఏర్పాటులో భాగస్వామి అయ్యాడు.పదవులు ఉన్నా,లేకున్నా తన ప్రజా సేవ ఆగదని తెలంగాణ గడ్డమీద కెసిఆర్ ని ఓడించడానికి,కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.రాజన్న అభివృద్ధి,అందుబాటు అనే నినాదంతోనే మునుగోడు ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో భాగం అవుతారాని,ఆయనకు రాజకీయం అంటే పదవి గాని,అధికారం గానీ కాదనీ,ప్రజల పట్ల ఆయన నిబద్ధత,తెలంగాణ పునర్నిర్మాణం పట్ల ఆయన కలలే ప్రేరణగా నిలిచాయి.మంత్రిగా ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటాడని త్వరలోనే మునుగోడు ప్రాంతంలో డబుల్ రోడ్ల నిర్మాణానికి రూ.163,85 కోట్లు పంచాయితీ రాజ్ నిధులు ఆయన సిఫారసుతో మంజూరు అయ్యాయి అదే విధంగా మునుగోడు ప్రాంతంలో రాబోయే ముడేండ్లలో శివన్న గూడెం ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయబోతున్నారు.ఈ సారి మంత్రివర్గంలో మా రాజన్నకి స్థానం లభించకపోవడం మా అందరికీ కాస్త నిరాశ కలిగించినా,రాజన్న ప్రజల మనసు గెలుచుకునే విధంగా సుదీర్ఘకాలంగా తెలంగాణ కోసంసాగించిన పోరాటం,ప్రజాసేవా పట్ల చూపించే నిబద్ధత,రాజన్న నేతృత్వం పట్ల మాకు అపారమైన విశ్వాసం పెంపొందించింది.రాజన్న ఆత్మవిశ్వాసం,అసలైన నాయకత్వ లక్షణాలు ఎల్లప్పుడూ మాకు ప్రేరణ.మన రాజన్న తిరిగి ఇంకా గొప్ప స్థాయికి ఎదగడం అనివార్యం.

