సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్18,(గరుడ న్యూస్):
జాతీయ కుటుంబ ప్రయోజనా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని బిజెపి పార్టీ మండల కార్యదర్శి జరుపు ల వినోద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ పథకం కింద 12.04.2017 తర్వాత భర్తలు మరణించిన స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం నుండి 20,000 ఇరవై వేల రూపాయలు నగదు జమ చేయడం జరుగుతుందని కావున అలాంటివారు మరన ధ్రువీకరణ పత్రం,ఆధార్ కార్డు, రేషన్ కార్డు,బ్యాంకు పత్రాలను జతపరిచి మీ సేవలో దరఖాస్తు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.



