
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 30
చౌడేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడిగా నియమితులైన పగడాల హరి రాయల్ సోమవారం పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆశీస్సులను అందుకున్నారు ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లిన హరి రాయల్ ను చెల్లా బాబు ఆశీర్వదించారు అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేస్తూ రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు అనంతరం సింగిల్ విండో చైర్మన్ యొక్క విధివిధానాలను దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నేత మాదిరాజు ప్రదీప్ రాజు సీనియర్ నాయకులు లక్ష్మణరాజు (పతిరాజు) కార్తీక్ రాయల్ సాగర్ నాయుడు రెడ్డి ప్రసాద్ ప్రహ్లాద చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

