


పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు అధ్యక్షతన మంగళవారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో కలిసి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షులు, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల తేదీ. 05-07-2025 శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల రొయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైసిపి శ్రేణులతో కలిసి జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని ఈ సమావేశం నకు ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేర్, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు పాల్గొనడం జరుగుతుంది అని తెలియజేసారు. అలానే ఈ ముఖ్య సమావేశానికి పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనాయకులు హాజరు కావడం జరుగుతున్న సందర్భంగా ఈ ముఖ్య సమావేశమునకు పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో గల మూడు మండలాలు, పురపాలక సంఘం నుంచి పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయి పార్టీ కమిటీ లో వివిధ హోదాలో గల సభ్యులు, ఎంపిపి లు, జడ్పీటీసీ లు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ డిసిసిబి, మాజీ డిసిఎంఎస్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు , ఎంపిటిసిలు మరియు పార్టీ నాయకులు అంతా తప్పక పాల్గొనీ విజయవంతం చేయాలని కోరుతూ మీ ద్వారా వాళ్ళందరికీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే జోగారావు క్యాంప్ కార్యాలయంలో తెలియజేసారు.
