
గరుడ న్యూస్, పాలకొండ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ పుట్టినరోజు వేడుక సమయంలో అందుబాటు లో లేరు. స్థానిక శాసన సభ్యులు నియోజకవర్గంకి వచ్చిన తరువాత సీతంపేట మండలంలో ప్రజా సమస్యలు పరిష్కార కార్యక్రమం తరువాత పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గం కి సంబందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు 4 మండలాల కూటమి నాయుకులతో చర్చించి, అనంతరం పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమక్షంలో జనసేన జానీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ పుట్టిన నుంచి జానీ కష్టపడే విధానం నేను గమనిస్తునే ఉన్నాను ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ గా ఉంటూ జనసేన పార్టీ నే తన వృత్తిగా భావించే వ్యక్తికి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించారు.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
3998006095155329186.jpg)
