
తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ ,ప్రతినిధి: రాజేష్:
మండలంలోని 69 ప్రభుత్వ పాఠశాలలు, రెండు జూనియర్ కళాశాలలు మరియు 7 ప్రైవేటు పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు. ఆయన గురువారం మండలంలోని దామల చెరువు,మొగరాల, ఓబుల శెట్టి వారి పల్లి ఉన్నత పాఠశాలలు, పాకాల యన్.వి.యన్.,రవణయ్య గారి పల్లి ప్రాధమిక పాఠశాలల్లో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో జూనియర్ కళాశాలల్లో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. సర్వే పల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ప్రతి పిల్ల వానికి స్టూడెంట్ కిట్ అందచేశారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు తరచుగా వచ్చి తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమతమ్మ మాట్లాడుతూ విద్యార్థులను ప్రతి రోజూ నిలపకుండా పాఠశాలకు పంపాలని పేర్కొన్నారు. ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు,మగవారికి మ్యూజికల్ ఛైర్స్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



