తెలంగాణ రాష్ట్ర నాయకులు, MLC గార్ల సమక్షంలో PRTUTS సంఘంలో చేరిన TPTF నాయకులకు సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన సాదర స్వాగతం

Jaipal Reddy
1 Min Read

PRTUTS సంఘ ఆశయాలు, MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సంఘ నాయకులు PRTUTS సంఘ పక్షాన ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేస్తూ పరిష్కారదిశగా చేస్తున్న కృషి, సంఘ ఆశయాలకు ఆకర్షితులై నాగలిగిద్ద మండలంలో TPTF సంఘం నుండి జిల్లా స్థాయి నాయకులు రవీంద్ర రావు, రాములు రాథోడ్ రాష్ట్ర సంఘ కార్యాలయంలో నేడు MLC శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పులగం దామోదర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ప్రభు ల సమక్షంలో PRTUTS సంఘ సభ్యత్వం తీసుకోవడం పట్ల సంగారెడ్డి జిల్లా శాఖ హర్షం ప్రకటిస్తూ ఉన్నది.TPTF జిల్లా నాయకులు PRTU సంఘంలో చేరికకు గాను విశేష కృషి చేసిన నాగలిగిద్ద మండల శాఖ అధ్యక్షులు శ్రీ రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీ నాగనాథ్ లకు ప్రత్యేక అభినందనలు తెల్పుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేరికలో భాగస్వామ్యులైన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ కె.దేవిసింగ్,శ్రీ మీర్ కిఫాయత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కం పాండురంగారెడ్డి, మనూర్, నారాయణఖేడ్, నాగలిగిద్ద మండల శాఖల అధ్యక్షులు శ్రీ మధుసూదన్ రెడ్డి, శ్రీ శివరాం నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీ కె.రాజు, నారాయణఖేడ్ మండల అసోసియేట్ అధ్యక్షులు శ్రీ దుర్గం నరసింహులు తదితరులందరకు PRTUTS సంగారెడ్డి జిల్లా శాఖ తరపున ప్రశంసాపూర్వక అభినందనలు తెలుపుతున్నాం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *