
పార్వతీపురం, గరుడ న్యూస్ (జులై 25)
అమరావతి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పలువురు మంత్రులు ఉన్నతాధికారులను కలిసి జిల్లాకి సంబంధించిన మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. తాజాగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో పోలీస్ స్టేషన్లకు మౌలిక వసతులు కల్పనకు నిధులు కేటాయించాలని గంజాయి, నాటు సారాను పూర్తిగా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డిజిపి హరీష్ కుమార్ గుప్తా నిధులు మంజూరుతో పాటు నాటు సారా, గంజాయి అరికట్టడానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



