
గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 17
వేడుకగా రాజనాల బండ తిరునాళ్లు
కనువిందుగా నిలిచిన ఉట్లోత్సవం
చౌడేపల్లి మండలంలోని పెద్దకొండమర్రి గ్రామ రెవిన్యూ వెంగళపల్లి పంచాయితీ రాజనాల బండ తిరణాలు వేడుకగా జరిగాయి సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండ ప్రసన్న ఆంజనేయ స్వామికి తిరునాళ్లు అంటేనే ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ఈ నేపథ్యంలో ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజీనాల బండ భక్తులతో కికిరిసిపోయింది చౌడేపల్లి పెద్ద కొండ మరి నుంచి గ్రామ పెద్దలు పోకమాను ఆనవాయితీగా రాజనాల బండకు తీసుకువచ్చారు వెంగళపల్లి పెద్ద కొండామర్రి దిగువపల్లి కొలింపల్లి తదితర ప్రాంతాల నుంచి కలశాలు బండకు చేరుకున్నాయి అనంతరం నాలుగు గ్రామాల నుంచి దేవరెద్దులు పాత గోబలవారిపల్లికి చేరుకున్నాయి అక్కడ విశేష పూజలు అనంతరం దేవరెద్దులను బండ పైకి తీసుకొచ్చారు అదేవిధంగా బోయకొండ గంగమ్మ జన్మస్థలమైన కొలింపల్లి నుంచి బండకు చేరుకొని తిరుణాలను సూక్ష్మ రూపంలో దర్శించుకున్నారు టిటిడి ఆధ్వర్యంలో రాజనాలబందపై పలు కార్యక్రమాలు నిర్వహించారు ఉదయాన్నే ప్రసన్న ఆంజనేయ స్వామికి ప్రధానార్చకుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విశేష పూజలు అలంకరణ నిర్వహించారు టిటిడి ఆధ్వర్యంలో రాజనాల బండ విద్యుత్ దీపాలతో దివ్యాంగ సుందరంగా అలంకరించారు ముఖ్యంగా రాజనాల బండ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్లోత్సవం తిరుణాలకే హైలెట్గా నిలిచింది పోకమాను బరిగిన అనంతరం ఉట్లు కొట్టడాన్ని ఘనంగా నిర్వహించారు ఆసక్తిగా తిలకించారు అదేవిధంగా ఉట్లోత్సవాన్ని యువకులందరూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పర్యవేక్షించారు ఎస్సై నాగేశ్వర రావు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు



