
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అగష్టు23,(గరుడ న్యూస్):
గ్రామీణాభివృద్ధి,ఉపాధి,పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పనుల జాతర 2025’ కార్యక్రమం లో భాగంగా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలోనీ పుర్లకుంట లో అంగన్‌వాడీ కేంద్రానికి 12 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మంజూరు అవ్వడంతో శుక్రవారం నూతన అంగన్‌వాడీ భవనానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి కొర్ర కిషన్,నాయక్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జనగాం గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్న,రాష్ట్ర ప్రభుత్వానికి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా ప్రతి పేద వాడికి ప్రభుత్వం అందించే పథకాలు అందే విధంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి చేస్తారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ జానయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి,కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా నాయకులు మహ్మద్ కాలేక్,మాజీ సర్పంచ్ గడ్డం శంకరయ్య,మాజీ ఎంపీటీసీ సభ్యులు బెల్లంకొండ శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర లక్ష్మయ్య,యాదగిరి,భిక్షం,మాజీ వార్డు సభ్యులు మంచాల ఏసు,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనురాధ,కారోబార్ లోడే యాదయ్య,అంగన్‌వాడీ టీచర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



