గరుడ ప్రతి నిధి చౌడేపల్లి ఆగష్టు 29
ఒంటిపై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది మండలంలోని పంచాయితీ కేంద్రం పెద్ద యల్లకుంట్ల కు చెందిన నాగమణి 40 గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా చికిత్స చేయించుకుంటుంది ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామానికి సమీపంలోని చెన్నరాజస్వామి ఆలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది అపస్మానిక పరిస్థితుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు తిరుపతి రూయాకు సిఫారసు చేశారు




